Sunday, 13 December 2015

Itu Itu Itu Ani Chitikelu Evarivo Song Lyrics

Varun Tej and Pragyajaiswal starrer Kanche (2015) is being directed by Gamyam fame Krish with historical backdrop. The movie was produced by Y.Rajeev Reddy and J.Sai Babu under the Banner named First Frame Entertainments Pvt. Ltd The film's music has been composed by Chirrantan Bhatt. Abhay Jodhpurkar soulful voice along with Shreya Ghoshal in Itu Itu Itu Ani Chitikelu Evarivo has taken the song to next level. Sirivennela Sitaramasastry, the legend lyricist in Telugu Film Industry had written the lyrics for Kanche. Music lovers who would want to practice this song may look here for complete lyrics.

Itu Itu Itu Ani Chitikelu Evarivo Lyrics in telugu

తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
 తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
 తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
 తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివోఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికోఏమో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివోఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికోఏమో
సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
 స్వరం లేని రాగంతో చెలిమికెలా స్వాగతమందో
 ఇలాంటివేం తెలియక ముందే
 మనం అనే కధానిక మొదలైందో …. మనం అనే కధానిక మొదలైందో
 ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివోఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికోఏమో
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
 తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన

           Charanam-1

ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
 చిరాకు పడేట్టు పరరైన్దోయ్ సమయం కనబడక
 ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెల్లిపోదా
 తనోటి ఉందని మనం ఎలాగు గమనించం గనక
 కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా
 మన దరికేవరు వస్తారు కదిలించగ
 ఉశస్సిలా ఉదయిస్తుందో నిశిదిలా ఎటు పోతుందో
 నిదర ఎపుడు నిదరపోతుందో మొదలు ఎపుడు మొదలవుతుందో
 ఇలాంటివేం తెలియక ముందే
 మనం అనే కధానిక మొదలైందో …. మనం అనే కధానిక మొదలైందో
 ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివోఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికోఏమో

           Charanam-2

పెదాల మీదుగా అదేమి గల గల పదాలె మాదిరిగా
 సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాదురిగా
 ఇలాంటి మేలుకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కదా
 పలానా అర్ధం అనేది తెలిపే నిఘంటువు ఉండదుగా
 కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా వినబోతున్న సన్నాయి మేళాలుగా